ఛ‌త్రినాక‌లో చిన్నారిపై అత్యాచారం

Monor Sexual Abuse
Sexual abuse

చాంద్రాయణగుట్ట: ఇంటి పక్కన ఆడుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ కథనం ప్రకారం.. ఉప్పుగూడ సాయిబాబానగర్ ప్రాంతానికి చెందిన అలంగర్‌స్వామి(35) స్థానికంగా టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తుంటాడు. ఈ నెల 3 సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి పక్కన ఆడుకుంటున్న బాలిక(8)ను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ బయటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా… స్వామి చేసిన ఆఘాయిత్యం తెలిసింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని నిర్భయ యాక్టు కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.