చేతులే లేనివారికి చెంపపై సిరా చుక్క..

ink mark on finger of a voter
ink mark on finger of a voter

హైదరాబాద్‌: పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశాక పోలింగ్‌ అధికారులు ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా గుర్తు పెడతారు. దాంతో సదరు ఓటరు తన ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకున్నట్లే. కాని చూపుడువేలు లేకపోతే అనే సందేహం తలెత్తుంది. దీనికి ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ మార్గాలను నిర్ధేశించింది. ఎడమ చేయి చూపుడు వేలు లేకుంటే మధ్య వేలుకు సిరా గుర్తు, అది కూడా లేకపోతే ఎడమచేయి ఏదో ఒక వేలికి , ఎడమ చేయి లేకపోతే కుడిచేయి చూపుడువేలు, అది లేకపోతే ఏదో ఒక వేలికి , అసలు రెండు చేతులు లేకపోతే చెంపపై సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం నిర్ధేశించింది.