చెక్ డ్యామ్‌ల నిర్మాణం వేగ‌వంతంః తుమ్మ‌ల‌

tummala
tummala

హైద‌రాబాద్ః రాష్ట్రంలో భూగర్భ జలాల సంరక్షణకే చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 193 చెక్ డ్యాం – బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రూ. 225 కోట్లతో 94 చెక్‌డ్యాం – బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు. మిగతా 99 చెక్ డ్యాం – బ్రిడ్జిల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. వీలైనన్ని చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి గుర్తు చేశారు. 511 వంతెనల నిర్మాణం జరుగుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.