చంద్రబాబు పెట్టుబడికి..కాంగ్రెస్‌ ప్రచారం..!

Laxman
Laxman

రాష్ట్రంలో బిజెపికి వస్తున్న ఆదరణ..స్పందన చేసి మోడీ. అమిత్‌ ఆనందం..ఆశ్చర్యం!!
కేసిఆర్‌..ఓటమి భయంతో బిజెపిపై విమర్శలు
కుటంబ పాలన కావాలా?..అవినీతి రహిత బిజెపి పాలన కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి
తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చే బిజెపికి ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె. లక్ష్మన్‌
హైదరాబాద్‌: చంద్రబాబునాయుడు పెట్టుబడికి కాంగ్రెస్‌ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని బిజెపి రాష్ట్ర అద్యక్షుల డాక్టర్‌ కె. లక్ష్మన్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపికి వస్తున్న ఆదరణ..స్పందన చూసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ..తమపార్టీ జాతీయాధ్యక్షులు అమిత్‌షా ఆనందం..ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కేసిఆర్‌ ఓటమి భయంతో బిజెపిపై విమర్శలకు దిగుతున్నారన్నారు. రాహుల్‌, చంద్రబాబు వారసత్వ రాజకీయాలు, కుటంబ పాలన కావాలా? అవినీతి రహిత బిజెపి పాలన కావాలో ఆలోచించాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చే బిజెపికి ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌, తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 50కి పైగా సభలు..పార్టీ అగ్ర నాయకుల ప్రచారంతో బిజెపికి గెలుపు భరోసా వచ్చిందన్నారు. బిజెపి మేనిఫెస్టో గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని లక్ష్మన్‌ వెల్లడించారు. ప్రజల పార్టీల బిజెపి కావాలో..లేక..కుటుంబ పార్టీలు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మజ్లీస్‌ను ఎదుర్కొనే దమ్ము బిజెపికి మాత్రమే ఉందని లక్ష్మన్‌ ఉద్ఘాటించారు. ప్రజల మూడ్‌ బిజెపికి అనుకూలంగా ఉండటం చూసి కేసిఆర్‌, రాహుల్‌, చంద్రబాబులు బెంబేలెత్తుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని మిగతా చోట్ల ఎదురైన చేదు అనుభవాలే కాంగ్రెస్‌కు తెలంగాణలో కూడా ఎదురవుతాయని లక్ష్మన్‌ జోస్యం చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపామని లక్ష్మన్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలవాటానికి పోటీ చేశామన్నారు. ప్రజా కూటమి ఓ విష కూటమి..మరోవైపు పరస్పర విరుద్దమైన పార్టీలు టిఆర్‌ఎస్‌, మజ్లీస్‌లు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ, అమిత్‌ షా సహా కమలదళం ప్రచారానికి రాహుల్‌, చంద్రబాబు హడలిపోయారన్నారు. ప్రజా కూటమి, అధికార టిఆర్‌ఎస్‌ పార్టీలు చెప్పే వాటిల్లో పసలేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషనఖ్‌ విధులు నిర్వర్తించాలని కోరారు. డబ్బు, అధికార దుర్వినియోగం కాకుండా యువమోర్చా కార్యకర్తలు నిఘా వేయాలని లక్ష్మన్‌ సూచించారు. ఎన్నికల కమిషన్‌ రెండు రోజులపాటు డబ్బు పంపిణీని అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణ ఆవతరణ అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. బిజెపి చాలా ఏళ్ల తర్వాత ఒంటరిగా పోటీ చేస్తూ హోరాహోరిగా ప్రచారం తమ అభ్యర్థులు సాగించారన్నారు. ఇతర పార్టీల నేతలు కోట్ల రూపాయలు ధారపోస్తున్నాయన్నారు. విస్తృతస్థాయిలో ఎన్నికల ప్రచార సభలోఎ్ల పాల్గొన్నందుకు ప్రధాని మోడీ, అధ్యక్షులు అమిత్‌షా, నాలుగు రాష్ట్రాల సిఎంలు, 40 మంది కేంద్రమంత్రులకు లక్ష్మన్‌ దన్యవాదాలు తెలిపారు.