గిరిజన విద్యార్థి ఆత్మహత్యాయత్నం

IMG--
IMG–

గిరిజన విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌µ: తొమ్మిదవ తరగతి చదువుతున్న క్రీడాపాఠశాల విద్యార్థి కె.అఃల్‌ (14) ఎలుకల మందు తిని ఆత్మహత్యయత్నం చేయగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అఃల్‌ ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉంది. కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలోని క్రీడా పాఠశాలలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు చెందిన కె.అఃల్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు ఎలుకల మందు తినగా ఇతర విద్యార్థులు చూసి డిఎస్‌ఓ జి.అశోక్‌కుమార్‌ దృష్టికి తేగా ఆయన అఃల్‌ను ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వారు బయలుదేరి వచ్చారు. ఇద్దరు కోచ్‌లు ఇబ్బంది పెట్టారని అందుకే ఎలుకల మందు తిన్నానని అఃల్‌ చెప్పగా విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని డిఎస్‌ఓ తెలిపారు. డివైఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు భీమా సాహెబ్‌, జి.తిరుపతి, నరేష్‌ తదితరులు ఆస్పత్రిలో అఃల్‌ పరిస్థితి ఆరా తీసారు.