గాంధీభవన్‌లో ముగిసిన ఇన్‌చార్జీల సమావేశం

Gandhi Bhavan
Gandhi Bhavan

హైదరాబాద్‌: నగరంలో గల గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీల సమావేశం ముగిసింది. సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సూచించారు. త్వరలోనే కార్యదర్శుల నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నాయకులు నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలు ప్రస్తావించగా,ముందుగా బూత్‌ కమిటీలు వేసి పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రతినియోజకవర్గానికి కార్యదర్శిని నియమించే యోచనలో కాంగ్రెస్‌ ఉందన్నారు.