గాంధారిలో గంజాయి స్వాధీనం

Ganjai
Ganja

కామారెడ్డి: గాంధారి మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న 54కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వారిలో ఒకరిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీ అయ్యారు. తక్కిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.