గంజాయి స‌ర‌ఫ‌రా చేసే ముఠా అరెస్టు

Ganjai
Ganjai

హైద‌రాబాద్ః నగరంలోని పాతబస్తీలో గంజాయి స‌ప్లై చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హట్‌కు చెందిన కాలుసింగ్, రితేశ్‌సింగ్‌ను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల గంజాయిని రూ.2 వేలకు కొనుగోలు చేసి రూ.4వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.