ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి జోరు

CONGRESS, TDP
CONGRESS, TDP

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి ఆధిక్యంతో దూసుకుపోతోంది. ప్రజాకూటమి తరపున పోటీ చేసిన చాలా మంది ముఖ్య నేతలు వెనుకంజలో ఉన్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో మాత్రం దీనికి భిన్నమైన ఫలితాలు వెలువడుతున్నాయి. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఏడు స్థానాల్లో ప్రజాకూటమి అభ్యర్థులు, టీఆర్ఎస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. పాలేరు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెనుకంజలో ఉన్నారు.