ఖమ్మంజిల్లాలో టిఆర్‌ఎస్‌ ఆశీర్వాదసభ

trs ashirvada sabha khammam
trs ashirvada sabha khammam

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలోంల టిఆర్‌ఎస్‌ గెలుస్తుందని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. డిసెంబరు 7న జరగబోయే శాసనసభ ఎన్నికల కోసం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈసభలో కెసిఆర్‌ మాట్లాడుతు రాష్ట్ర ప్రజానీకం శ్రేయస్సు కోసం అరగంట కింద యాగం చేసి వచ్చాను. ఉద్యమ చైతన్యం ఖమ్మం జిల్లాలో బాగా ఉండేది. రాజకీయంగా మాత్రం సరైన ఫలితాలు వచ్చేవి కావు. కొంచెం కఠినంగా అనిపించినా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉంటాయి. రాజకీయ కార్యకర్తగా చెబుతున్నా. మనం ఎవరూ శాశ్వతం కాదు. జిల్లా, రాష్ట్రం ప్రజలు శాశ్వతం. కాబట్టి రాష్ట్రంలో ఏ జరుగుతుంది అని వివేచనతో ఆలోచించి ఓటేయ్యాలన్నారు సీఎం కేసీఆర్.