కౌన్సిల్‌ సమావేశం

TS CM KCR11
TS CM KCR11

కౌన్సిల్‌ సమావేశం
పలు సంతాప తీర్మానాలు

హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభం అయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే అపద్దర్మ ముఖ్యమంత్రి హోదాలో కె.చంద్రశేఖరరావు హాజరు అయ్యారు. మాజీ ప్రధాని వాజపేయి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, లోకసభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌చటర్జీ, మిమిక్రీ ఆర్టిస్టు నేరేళ్ల వేణుమాధవ్‌లతో పాటు కొండగట్టు ఆర్‌టిసి బస్సు ప్రమాద మృతులకు, కేరళ వరదల్లో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని వాజపేయి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, లోకసభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌చటర్జీ, మిమిక్రీ ఆర్టిస్టు నేరేళ్ల వేణుమాధవ్‌లు దేశానికి చేసిన సేవల గురించి సిఎం కొనియాడారు.

కొండగట్టు ఆర్‌టిసి బస్సు ప్రమాద మృతులకు, కేరళ వరదల్లో మృతి చెందిన వారికి సంబంధించి స్పీకర్‌ సంతాపం తీర్మాణాన్ని ప్రవేశపెట్టి మధ్యాహ్నం 12.49గంటలకు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాజపేయి విలక్షణ నేత…హైదరాబాద్‌లో స్మారక భవనం నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉండటమే కాకుండా దేశ ప్రధానుల్లో అటల్‌ బిహారీ వాజపేయి విలక్షణమైన నేత అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయికి సిఎం కెసిఆర్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ముక్కుసూటిగా, నిష్కర్షగా వెళ్లే వ్యక్తి అయన అన్నారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారన్నారు. వాజపేయి తాను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారన్నారు. మడమతిప్పలేదు, చివర వరకు పోరాటం చేశారన్నారు. వాజపేయి ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని అవుతారని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారని, ఆయన మాటాలను వాజపేయి నిజం చేశారన్నారు.

ఆయన జ్ఞాపకాలు భావితరాలకు స్ఫూర్తి ఉండాలన్నారు. వాజపేయి గొప్ప వ్యక్త అని, ప్రతిపక్షంలో ఉన్న గౌరవం తగ్గలేదన్నారు. సభలో వాజపేయి మంచి ప్రసంగాలు సాగాయి.