కోదండరాం సంచలన నిర్ణయం

Kodandaram /Ponnala Lakshmaiah
Kodandaram /Ponnala Lakshmaiah

హైదరాబాద్‌: జనగాం బరి నుండి టీజేఏస్‌ అధ్యక్షుడు తప్పుకోవాలని కోదండరాం నిర్ణయించుకున్నట్లుగా తెలియవచ్చింది. బీసీలకు అన్యాయం జరగకూడదనే కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవచ్చింది. జనగాం నుంచి కోదండరాం సోటీ చేస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్‌ మాజీ మంత్రి లక్ష్మయ్య పేరు లేకపోవడంతో కోంత అసక్తి నెలకొంది. మంగళవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో టీజేఏస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం సోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.