కేసిఆర్ పోడు రైతుల‌ను గుర్తించ‌డం లేదు

Laxman
Laxman

మంచిర్యాలః కౌలు రైతులను అవహేళన చేస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడటం దారుణం అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకంలో గిరిజన పోడు రైతులను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. మంగళవారం మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన లక్ష్మణ్ తెలంగాణలో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం దారుణమన్నారు. కనీసం మహిళా కమీషన్ ఏర్పాటు చేయని చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి ఏదో చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందని లక్ష్మణ్ ప్రశ్నించారు.