కేసిఆర్‌ సింహమైతే జూలో పెట్టాలి

v hanumanta rao
v hanumanta rao

హైదరాబాద్‌: కేసిఆర్‌ను సింహంలా కేటిఆర్‌, కవిత అభివర్ణిస్తున్నారని , నిజంగానే సింహమైతే కేసిఆర్‌ను జూపార్క్‌లో పెట్టాలని జూ అధికారులకు లేఖ రాస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని గతంలో దొరల పాలనను గుర్తు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ఒక ప్రభుత్వానికి సియం కేసిఆర్‌ ఐతే మరో ప్రభుత్వానికి సియం ఓవైసి అని ఆయన విమర్శించారు.