కేసిఆర్‌పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

SRIDHAR BABU
SRIDHAR BABU

కరీంనగర్‌: గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసిఆర్‌ నెరవేర్చలేదనే అసంతృప్తితో ప్రజలు ఉన్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ప్రతిపక్షాలపై ఉన్న అక్కసుతోనే విపక్ష నేతలపై తప్పుడు కేసుల్లో ఇరికించాలని కేసిఆర్‌ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..మెజారిటీ సీట్లను గెలుచుకోవడం ఖాయమని అన్నారు. కేసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అసంతృప్తితో ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందని , సోనియా లేకుంటే తెలంగాణ రాకపోయేదని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఒక్కసారి సోనియాకు ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నట్లు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా కనిపిస్తుందని శ్రీధర్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.