కేసిఆర్‌కు భట్టి హెచ్చరిక

Bhatti
Bhatti

హైదరాబాద్‌: సియం కేసిఆర్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు భట్టివిక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. బెదిరించి పని చేయాలనుకుంటున్నారా అని కేసిఆర్‌ను ప్రశ్నించారు. సియం కేసిఆర్‌ చట్టబద్ధంగా పని చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ నేతల అవినీతిని కక్కిస్తామన్న కేసిఆర్‌ వ్యాఖ్యాలపై స్పందించిన ఆయన అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ సరిగా పనిచేయని పక్షంలో ప్రజలు బండకేసి కొడతారన్న వాస్తవాన్ని గుర్తించాలి అని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పోరాడుతూనే ఉందన్నారు. అధికారంలోకి రానంత మాత్రాన కుంగిపోమని వ్యాఖ్యానించారు.