కేటిఆర్‌వి పగటి కలలు: దత్తాత్రేయ

bandaruFFFF
bandaru

హైదరాబాద్‌: తెలంగాణలో భావసారూప్య శక్తులు..గ్రూపులతో కలిసి ముందుకెళ్లేందుకు సిధ్దంగా ఉన్నామంటూ కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 300 సీట్లు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల సందర్బంగా పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. బిజెపిలో చేరేందుకు చాలా మంది నేతల ఉత్సుకతతో ఉన్నారనీ, పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఓవైపు టిఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోంటే..మరోవైపు అపధ్దర్మ మ్తంరి కేటిఆర్‌ మాత్రం పగటి కలలు కంటున్నారని దత్తాత్రేయ ఎ ద్దేవా చేశారు. కాగా అయోధ్య అంశాన్ని రావణ కాష్టంలా ఉంచాలని ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసి భావిస్తున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌కు రాజ్యాంగ విరుద్దమని ఓవైసి చెప్పడం సరికాదన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపి సిఎం చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయం కోసం ప్రధాని నరేంద్రమోడీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి శక్తులతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు.