కేటాయింపులు ఘనం, అరకొర వ్యయం

TS Finance Minister E Rajendar
TS Finance Minister E Rajendar

కేటాయింపులు ఘనం, అరకొర వ్యయం

కోనేటి రంగయ్య / హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు వ్యయా నికి పొంతనకుదరడంలేదు. ముఖ్యంగా ప్రాధాన్యతా రంగాల్లో వ్యయం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.ఆదాయంలో పెరుగుదల ఉన్నప్పటికీ ఆయా పథకాలకు జరుగుతున్న వ్యయం తక్కువగా ఉంటు న్నది.

దాదాపు 18 శాతంవరకు రెవెన్యూలో పెరుగు దల ఉందనేగణాంకాలతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి నూతన బడ్జెట్‌ రూప కల్పనకు కసరత్తు చివరి దశకు వచ్చింది. మార్చి నెలాఖరు వరకు శాసనసభను కనీసం 16 పనిదినాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమో దిస్తారు. ఈ మేరకు రాష్ట్ర స్వంత రెవెన్యూతోపాటు కేంద్రంనుంచి వచ్చేగ్రాంట్లు, రుణాలతో సహా ఆదాయ వనరులను పరిశీలించి, వ్యయాన్ని అంచనా వేసి కొత్త బడ్జెట్‌నురూపొందిస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలనుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాద నలు స్వీకరించి, సమావేశాలు నిర్వహించి, డ్రాప్టును తయారు చేయడంతో పాటు ముఖ్యమంత్రితోనూ సంప్రదింపులు జరిపింది.

దీనిపై ముఖ్యమంత్రి బడ్జెట్‌కు సంబంధించి మరోసారి సమావేశం నిర్వహించి శాఖల వారీగా ప్రాధాన్యత లను నిర్ణయించి కేటాయింపులపై తుదినిర్ణయం తీసు కుంటారని ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి రెండోవారంలో నిర్వహించేందుకు నిర్ణయిం చారు. కాగా కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌కు ఇటీవల ప్రతిపాదించిన బడ్జెట్‌ను పరిశీలిస్తే తెలంగాణకు నిధుల మంజూరీలు పెరిగాయి.

పన్నుల వాటాగాదాదాపు రూ.19,207కోట్లతొమ్మిది లక్షలు నూతన ఆర్థిక సంవత్సరం 2018-19 లో తెలంగాణకు కేటాయించే విధంగా కేంద్ర బడ్జెట్‌లో చూపారు. ఇక జనాభా ప్రాదిపదికగా ఆయా కేంద్ర ప్రాయోజిత పథకాల(సెంట్రల్‌ స్పాన్సర్డు స్కీం-సిఎస్‌ఎస్‌) కింద తెలంగాణకు పదివేల కోట్ల రూపాయలకు పైగానే లభించే అవకాశాలు న్నట్లుగా బడ్జెట్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఇక ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసుల కింద తెలంగాణకు లభించే గ్రాంట్లనుపరిశీలిస్తే గ్రామ పంచాయితీ లకు సుమారుగా 1200 కోట్ల రూపాయలు, అర్బన్‌ లోకల్‌బాడీ(మున్సిపాలిటీ)లకు రూ. 600 కోట్లు లభిస్తాయి.

ఏటేటాపెరుగుతున్న కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ స్వంత రెవెన్యూ లోనూ పెరుగుదలలకు తోడు అప్పులు తీసుకునేందుకు పెరుగుతున్న వెసులు బాటు వెరసి బడ్జెట్‌ సైజు భారీగానేఉంటున్నది. దీంతో తెలం గాణలో ప్రాధాన్యతా రంగాలైన భారీ నీటిపారు దల శాఖ, సంక్షేమ శాఖలకు కేటాయింపులు పెద్దమొత్తంలోనే ఉంటున్నాయి.

అయినప్పటికీ ఈ రంగాల్లో వ్యయం తక్కువగా ఉండటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆశించినమేరకు ఆదాయం అందుబాటులో లేనం దునే ఆయా రంగాలకు బడ్జెట్‌లో చేసిన నిధుల కేటాయింపు లకు ఆ శాఖల్లో ఖర్చుకు పొంతనలేని పరిస్థితి ఏర్పడుతున్నదని చెబుతు న్నారు. అయితే ఈ కీలక రంగాలలో వ్యయం విషయంలో దాదాపు ప్రతి ఆర్థిక సంవత్సరం లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కొన్ని సంవత్సరాల్లో ఈరెండు రంగాలకు కేటాయిం చిన మొత్తాల్లో సగం కూడా వ్యయం చేయలేని దుస్థితి ఏర్పడుతున్నది. తెలంగాణలో సాగునీటిరంగానికి అత్యధిక ప్రాధా న్యత నిస్తున్నట్లుగా పాలనాయంత్రాంగం చెబుతూ బడ్జెట్‌లోనూ భారీ కేటాయింపులే చేస్తు న్నది. ఈ మేరకు దాదాపు 25 వేలకోట్ల రూపా యలు వరుసగా ఈ రంగానికి బడ్జెట్‌ ప్రతిపాదన లున్నాయి. ఇతరత్రా వ్యయం మినహాయిస్తే నీటి పారుదల రంగంలోవాస్తవంగా జరిగిన పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే కనిపిస్తున్నది.

బడ్జెట్‌ గణాంకాలను పరిశీలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగంలో జరిగిన వాస్తవ వ్యయం 7,776 కోట్లు మాత్రమే. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలోనూ కేటాయిం పులు 25 వేల కోట్లకు పైగానే ఉండినప్పటికీ వాస్తవ వ్యయం 14,304 కోట్లకు మించలేదు. ఇక వచ్చే నెల మార్చితో ముగస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ వ్యయం 15 వేల కోట్లకు మించే అవకాశాలు కనిపించడం లేదు.

సంక్షేమ రంగంలో భాగంగా షెడ్యూల్డు కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి వ్యయం గణాం కాలు ఆసక్తికరంగాఉన్నాయి. 2017-18 ఆర్థిక సంత్సరంలో ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఈరంగానికి కేటాయిపులు రూ. 14,375కోట్లు కాగా ఇప్పటివరకు అంటే 11 నెలల్లో జరిగిన వ్యయం కేవల రూ.6689 కోట్లు మాత్రమే. అంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగుస్తున్నందున మరో 40 రోజుల్లోనే మిగిలిన మొత్తం రూ.7686కోట్లను పూర్తిగా ఖర్చుచ ేయాలి. ఇదిదాదాపు అసాధ్యమే. ప్రతి ఏడాది ఇదేవిధంగా సంక్షేమ రంగానికి బడ్జెట్‌ కేటాయిం పులు భారీగానే ఉంటున్నా వ్యయం పూర్తిగా చేయలేకపోతున్నారు.అయితేఅనుత్పాదక వ్యయం భారీగా పెరుగుతున్నందున పెట్టుబడి వ్యయంలో కోత తప్పడం లేదు. కొత్త బడ్జెట్‌లో రైతులకు పెట్టుబడి వ్యయంగా భారీ కేటాయింపులు అవసరం అవుతున్నాయి.

రుణమాఫీ పథకం కింద మొదటి మూడు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు నాలుగు వేల కోట్ల వరకు వ్యయంకాగా 2018-19 ఆర్థిక సంవ త్సరం నుంచి రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కింద ఎకరాలకు రెండు విడతలుగా నాలుగు వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున ఏడు వేల కోట్ల కు పైగా ఈ పద్దు కింద నిధులు కేటాయించాల్సిఉంటుంది. ఇన్‌ఫుట్‌సబ్సిడీకితోడు రైతులకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా ఉచితంగా అందించేం దుకు ఇప్పటికే నిర్ణయం జరిగి, అమలు కొన సాగుతున్నది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ తన కేటాయింపులను 8వేల కోట్లకు పైగా పెంచాలని కోరుతున్నది.

పెరిగిన రుణాల వల్ల వచ్చే సంవత్సరాల్లో అసలు, వడ్డీల భారం మరింత పెరిగి అనుత్పాదక వ్యయం ఖాతా మరింతగా పెరుగుతుంది. జిఎస్‌డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి దాదాపు ఎనిమిది లక్షల కోట్లకు చేరు తున్నందున ఇందులో మూడు శాతం వరకు రుణం తీసుకునే సదుపాయం ఎఫ్‌ఆర్‌బిం చట్ట పరిధిలో లభిస్తున్నది.

ఇప్పటికే రాష్ట్రం లక్షన్నర కోట్ల రూపాయల వరకు రుణం తీసుకుంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ద్వారా కూడా సేకరించిన రుణాలను కూడా చేర్చితే ఇది మరింతగా పెరుగుతుంది. దీనిపై వడ్డీ అసలు కింత ఏటా చెల్లింపులకు భారీగానే నిధులు బడ్జెట్‌లో కేటాయించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 11,350 కోట్లవరకు ఈ పద్దు కింద వ్యయం అవుతున్నది. ఈ మేరకు పెరుగుతున్న రుణాల కింద మరింతగా బడ్జెట్‌ కేటాయింపు తప్పదు. మిషన్‌భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇతరత్రాపథకాలకు బడ్జెట్‌లో చూప కుండా పెద్దయెత్తున రుణాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

భగీరథ పూర్తి చేయడానికి దాదాపు 42 వేల కోట్ల వ్యయం అవసరం. ప్రస్తుతం ఈ మొత్తంబడ్జెట్‌లో చూపకపోయినా, తిరిగి బకాయిలు తీర్చాలంటే వడ్డీతో సహా, అసలు ప్రభుత్వమేపూర్తిగా బడ్జెట్‌ద్వారానే చెల్లిం చాల్సి ఉంటుంది. కాళేశ్వరం కావచ్చు,

ఇతర ఏ ప్రాజెక్టు అయినా రుణాలు తీసుకొని నిర్మించిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం చెల్లించాలి. దీనికి వెంటనే బడ్జెట్‌ కేటాయింపులు అవసరం లేకున్నా, తర్వాతి సంవత్సరాల్లో ఈ మొత్తాలు బడ్జెట్‌ కేటాయింపుల్లోకి రాకతప్పదు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెరుగుతున్న ఉద్యోగ నియామకాలకు నిధులను బడ్జెట్‌లో పెంచాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఉన్న వ్యయంకు తోడు ఉద్యోగులు జీత,భత్యాలు- పెన్షన్లు,మరో కీలకపద్దు. ఉద్యోగుల భర్తీకి తీసుకుంటున్న చర్యలవల్ల దాదాపు 23వేల మంది నియామకం జరిగే అవకాశాలున్నాయి. దీంతో బడ్జెట్‌పై అదనపు భారం పడుతుంది. ఇక విద్యా, వైద్యం, పోలీసు శాఖల్లో కూడా భర్తీలు అదనంగా జరిగితే ఈ భారం మరింతపెరిగి బడ్జెట్‌లో అదనపు కేటా యింపులు జరగాల్సి ఉంటుంది. ప్రగతి పద్దు ఎలా ఉన్నప్పటికీ రెవెన్యూ వ్యయం భారీగా ప్రతి ఏడాదిపెరుగుతున్నది. ఎస్సీ,ఎస్టీ, బిసి సంక్షేమ శాఖలకుమొత్తం సంక్షేమ రంగానికి ఈ కొత్త బడ్జెట్‌లోనూ మొత్తం కేటాయింపులు 56 వేల కోట్లవరకు ఉండబోతున్నాయి