కేంద్ర మంత్రికి మంత్రి హ‌రీష్ లేఖ‌

T. Harish rao
T. Harish rao

హైద‌రాబాద్ః కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ఈ రోజు తెలంగాణ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు లేఖ రాశారు. సీతారామ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పాత ప్రాజెక్టుగానే ప‌రిగ‌ణించాల‌ని కేంద్ర‌మంత్రిని లేఖ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. మూడు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌నుసీతార‌మ ప్రాజెక్టుగా ప‌రిగ‌ణించాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాజీవ్‌సాగ‌ర్‌, ఇందిరాసాగ‌ర్‌, దుమ్ముగూడెం, ఎత్తిపోత‌ల‌ను సీతారామ ప్రాజెక్టుగా ప‌రిగ‌ణించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కాళేశ్వ‌రం త‌ర‌హాలోనే సీతారామ ప్రాజెక్టును కూడా పాత ప్రాజెక్టుగా ప‌రిగ‌ణించాల‌ని ఆ లేఖ‌లో కేంద్ర‌మంత్రిని కోరారు మంత్రి హ‌రీశ్‌రావు.