కేంద్ర కృషితోనే నిరంతరం విద్యుత్‌: దత్తాత్రేయ

Dattatreya
B. Dattatreya

హైదరాబాద్‌: కేంద్రం కృషి వలన తెలంగాణ రాష్ట్రంలో 24గంటల విద్యుత్‌ నిరంతరంగా సరఫరా అవుతున్నదని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. నేడు విలేఖర్లతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్లీనరీ సొంత డబ్బాకే పరిమితమైందని విమర్శలు చేశారు. కెసిఆర్‌ తన ప్రసంగాలలో వాస్తవాలను విస్మరించి మాట్లాడారని దతాత్రేయ అన్నారు. దేశంలో బిజెపి అధికారంలో ఉన్నది దశాబ్ద కాలం మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్‌ను బిజెపిని ఒకే గాటన పెట్టడం సరికాదని దత్తాత్రేయ తగదని పేర్కొన్నారు.