కెసిఆర్‌ కొత్త సంప్రదాయానికి తెరతీశారు

V.Hanumantha Rao
V.Hanumantha Rao

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతు ఏపికి పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. ప్రధాని మోడికి తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల పరిష్కారంతో పాటు ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యమవుతాయని చెప్పారు. మంత్రివర్గం లేకుండా సీఎం కెసిఆర్‌  కొత్త సంప్రదాయానికి తెరతీశారని.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని హనుమంతరావు  వ్యాఖ్యానించారు.