కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం

Kinnera Sani Project
Kinnera Sani Project

భద్రాద్రి కొత్తగూడెం:  పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్  నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. జలాశయంలోకి 23,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయ పరిరక్షణ నిమితం అధికారులు 5 గేట్లు ఎత్తివేసి  30000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టo 407.00 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 404.90 అడుగులకు చేరుకుంది. రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 8.4 టీఎం సీలు కాగా, ప్రస్తుతం 7.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది.