కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగనొస్తే తప్పేంటి?

jagga reddy
jagga reddy


హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి సియం జగన్‌, మహారాష్ట్ర సియం ఫడ్నవీసు వస్తే తప్పేంటని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మంచి పని ఎవరు చేసినా సమర్దించాలన్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులు ఎవరు కట్టినా ప్రజల కోసమేనని పేర్కొన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్ల కేసిఆర్‌ సియం అయ్యి కాళేశ్వరం కట్టే అవకాశం వచ్చిందని వెల్లడించారు. కాళేశ్వరం అవినీతి గురించి తాను మాట్లాడనన్నారు. ఆ విషయం భట్టి విక్రమార్క చూసుకుంటారన్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/