కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండో దశ అనుమతులిచ్చిన కేంద్రం

Kaleshwaram
Kaleshwaram project

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం రెండో దశ అనుమతులను జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం అధికారిక సమాచారం అందింది. 8అటవీ డివిజన్ల పరిధిలో 3221హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం కేటాయించేందుకు కేంద్రప్రభుత్వం సుముఖుత వ్యక్తం చేసింది. దీంతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేందుకు మార్గం సుగుమమైంది. దీనిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.