కాళేశ్వరంలో పైప్‌లైన్‌ బదులు టన్నెల్‌!

kaaleswaram project
kaaleswaram project

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు తాజా ప్రతిపాదన చేశారు. మూడో టిఎంసి నీటి సరఫరా కోసం ముందుగా పైప్‌లైన్‌ వేద్దామని అనుకున్నారు. కాని ఇప్పుడు పైప్‌లైన్‌ స్థానంలో టన్నెల్‌ వేసే ప్రతిపాదనలో ఉన్నారు. అందుకోసం రూ.25 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనావేసి ఈ మేరకు ఇంజనీర్లు ప్రభుత్వానికి ఫైలు పంపారు. దీనిపై రేపో మపో అనుమతి వ చ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. టన్నెల్‌కు కిలోమీటరుకు రూ.120 కోట్ల ఖర్చు అవుతుందని, పైప్‌లైన్‌ ఏర్పాటుతో వ్యయం రెట్టింపు అవుతుందన్నారు. టన్నెల్‌ మన్నిక వందేళ్లు ఉంటుందని, పైప్‌లైన్‌ ఐతే 30-40 ఏళ్లే ఉంటుందన్నారు. భూసేకరణకు అధిక వ్యయం అవుతుందని, ఏటా విద్యుత్‌, నిర్వహణ భారమూ ఎక్కువే ఉంటుందని ఇంజనీర్లు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/