కాళేశ్వరంపై కెసిఆర్‌ను ఆభివర్ణించిన గవర్నర్‌

Governor Narasimhan
Governor Narasimhan

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ ప్రాజెక్టు సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, వెల్డర్లతో మాట్లాడానని అన్నారు. అక్కడ అన్ని పనులు సమర్ధవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నాటికి కాళేశ్వరం తొలిదశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహిస్తోన్న తెలంగాణ సీఎం కెసిఆర్‌, మంత్రి హరీష్‌రావులపై గవర్నర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. కెసిఆర్‌ను తాను ఇకపై కాళేశ్వరం చంద్రవేఖరరావు అని మాత్రమే పిలుస్తానని, అలాగే హరీష్‌రావు తన పేరును కాళేశ్వరరావుగా మార్చుకుని చరిత్రలో నిలిచిపోతారని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.