కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత‌ల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఉంటుందిః ఉత్త‌మ్

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

హైద‌రాబాద్ః ఇటీవ‌లే త‌మ పార్టీలో చేరిన టీడీపీ నేత‌ల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఉంటుంద‌ని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఇక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నుంచి త‌మ పార్టీలోకి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి 2019 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌లో మంచి పదవి దక్కుతుందని, మిగ‌తా నేత‌లు సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డిలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామ‌ని తెలిపారు. అలాగే పార్టీ మారుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోన్న‌ నాగం జ‌నార్ద‌న్ రెడ్డి అంశంపై కూడా ఉత్త‌మ్ మాట్లాడుతూ ఆయ‌న చేరికపై తాను మాట్లాడలేనని తెలిపారు.