కాంగ్రెస్‌ వేసిన కేసులపై త్వరలో ఓ పుస్తకం విడుదల: హరీష్‌రావు

ts minister harish rao
ts minister harish rao

హైదరాబాద్‌: తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో
మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు లెక్కలేనన్ని కేసులు వేశారని,
చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందని, ఈ కేసులపై త్వరలోనే
ఓ పుస్తకం విడుదల చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన ప్రతిపక్షాలకు అహంకారంగా
కనిపిస్తోందని, కాంగ్రెస్‌ పాలనలో ఆంధ్రాకు అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతల
పౌరుషం ఏమైందని, నాడు పులిచింతల ప్రాజెక్టును కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు
దగ్గరుండి కట్టించారని, ఇది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేయడం మా
పార్టీ చరిత్రలో లేదని, వచ్చే ఎన్నికల్లో మీరేమిటో, మేమేమిటో ప్రజలే తేలుస్తారని ఆయన తీవ్ర స్థాయిలో
ద్వజమెత్తారు.