కాంగ్రెస్‌ నేతలవి పిచ్చి ఆరోపణలు-మంత్రి తలసాని

Talasani Srivinivasa Rao
Talasani Srivinivasa Rao

 

హైదరాబాద్‌: కేటిఆర్‌పై కాంగ్రెస్‌నేతలు పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా హిమాన్షు మోటార్స్‌
కార్యకలాపాలు సాగడం లేదని, కాంగ్రెస్‌ నేతలకు కేటిఆర్‌ క్షమాపణ చెప్పాల్సిన అవసరం
లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం మీడియాతో తలసాని మాట్లాడుతూ వ్యాపారాలు
ఎవరైనా చేయోచ్చునన్నారు. సిరిసిల్ల ఘటనను బూచీగా చూపి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కాంగ్రెస్‌
నేతలు ప్రయత్నిస్తున్నారనీ ఆయన విమర్శించారు. దళితుల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి
ఉందని మంత్రి స్పష్టం చేశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదని విమర్శించారు.
కాగా దళితుల సమస్యలపై కాంగ్రెస్‌ నేతలు బహిరంగ చర్చకు సిద్దమా? అని యాదవ్‌ సవాల్‌ చేశారు.
సిరిసిల్లలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏదో చేస్తానని అంటున్నారనీ, కేటిఆర్‌ను చూస్తేనే విపక్ష నేతలు భయపడుతున్నారనీ
వ్యాఖ్యానించారు. కోదండరామ్‌ రాజకీయాల్లోకి రావాలంటే రావొచ్చు కానీ..ఇలా వ్యవహరించడం
సరైన పద్దతి కాదని శ్రీనివాస్‌ యాదవ్‌ హితవు చెప్పారు.