కాంగ్రెస్‌ గెలిస్తే ఇల్లు గుల్ల..

kcr
kcr

హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిలువుదోపిడికి తెర లేపిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఎన్నికల్లో మరో మోసానికి రచన చేసింది. కాంగ్రెస్‌ కొత్త రకం వేషాలతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇండ్లు కట్టిస్తాం…,జాగాలిస్తాం అంటూ మాయమాటలు చెప్తున్నారు. కాంగ్రెస్‌ను పొరపాటున గెలిపిస్తే..ఇండ్లన్నీ గుల్ల చేస్తారని కేసిఆర్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాం అని కేసిఆర్‌ గుర్తుచేశారు. సొంత స్థలంలో ఇండ్లు కట్టుకోవడానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఉండగా కాంగ్రెసోళ్లు రుణం ఇచ్చేపనేముంది. అందుకే ఓటును జాగ్రత్తగా వేసి ప్రజలు వారి విజ్ఞతను చాటు కోవాలని కేసిఆర్‌ పిలుపునిచ్చారు.