కాంగ్రెస్‌ ఎన్నికూటమిలు కట్టినా ప్రజలు విశ్వసించారు…

Harish rao
Harish rao

సిద్దిపేట: వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయమని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎన్ని కూటమిలు కట్టినా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కోతలు, ఎరువుల కొరత తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌ నేతృత్వంలో గజ్వేల్‌ నియోజకవర్గం దేశానికే రోల్‌ మోడల్‌ అవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటూ కొనియాడారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవీ చెప్పనివీ అమలు చేశామని హరీష్‌రావు తెలిపారు.