కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే సంగారెడ్డికి క్షణాల్లో నీళ్లు

jagga reddy
jagga reddy


హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ నేతలపై సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గోదావరి జలాలను సంగారెడ్డికి తీసుకురాలేకపోయారంటూ టిఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. అవగాహన లేని నేతలు సంగారెడ్డిలో ఉండడం దురదృష్టకరమంటూ టిఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను ఈ సందర్బంగా జగ్గారెడ్డి తిప్పికొట్టారు. ఎవరు కబ్జాలు చేశారో, ఎవరు ఎవరిని ముంచాఓ తెలుసుకునేందుకు చర్చకు సిద్దంగా ఉన్నామని, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే సంగారెడ్డికి క్షణాల్లో నీళ్లు తెచ్చి ప్రజల దాహార్తి తీర్చేవాడినని అన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos