కాంగ్రెస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్లే

Laxman
Laxman

హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీల విన్యాసాలు, డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారని డిబిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడతూ తెలంగాణలో మార్పు బిజెపితోనే సాధ్యమని లక్ష్మణ్‌ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర, బలమైన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ ఇప్పుడు బలహీన పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్లేనని అన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే అర్హతను కాంగ్రెస్‌ పోగోట్టుకుందన్నారు.