కలెక్టరుకు ఎలక్షన్‌ కమీషన్‌ అవార్డు

gourav uppal,collector
gourav uppal,collector

నల్గొండ: జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఆచరణ కార్యక్రమాన్ని అత్యుత్తమంగా నిర్వహించినందుకు కలెక్టరు గౌరవ్‌ ఉప్పల్‌ ఎలక్టోరల్‌ బెస్ట్‌ ప్రాక్టీసర్‌ అవార్డుకు ఎంపికయ్చారు. ఆయనతో పాటు ఎలక్టోరల్‌ రిజిస్టర్‌ ఆఫీసర్‌ అవార్డుకు నల్గొండ ఆర్డీఓ వెంకటాచారి ఎంపికయ్యారు. నల్గొండ నియోజక వర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం, ఓటర్‌ ఐడి కార్డులకు ఆధార్‌ ఫీడింగ్‌ ,యూత్‌ క్లబ్‌ల ఏర్పాటు తదితర అంశాల్లో కలెక్టరు గౌరవ్‌ ఉప్పల్‌ ప్రతిభ చూపడంతో అవార్డుకు ఆయన్ను ఎంపిక చేశారు.