ఓబిసిల‌కు రాజ్యాంగ హోదా చారిత్రాత్మ‌కం

B.Dattatreya
B.Dattatreya

హైద‌రాబాద్ఃఓబీసీలకు రాజ్యాంగ హోదా చారిత్రాత్మకమని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఎంపీ దత్తాత్రేయ భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలను ఎవరైనా వేధిస్తే ముందస్తు బెయిల్ రాదని, నేరుగా విచారణాధికారి అరెస్ట్ చేయవచ్చని హెచ్చరించారు. కొన్ని రాజకీయ పార్టీలు దళితులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులపై విచారణ జరిపించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.