ఓట్ల కోసం ప‌థ‌కాలు ప్రవేశ‌పెట్ట‌డం లేదుః ఈటెల‌

eetela
eetela

హైద‌రాబాద్ః టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టడ‌డంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసమే కొన్ని పథకాలు ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఓట్ల కోసమే పథకాలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. పెన్షన్లు ఈ ఏడాది ప్రవేశపెట్టలేదు. రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చామా? అధికారంలోకి వచ్చిన వెంట‌నే పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికలతో సంబంధం లేకుండా తెలంగాణకు గొప్ప పునాదులు వేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.