ఐపిఎల్ అభిమానుల‌కు మెట్రో గుడ్ న్యూస్‌

Hyd Metro
Hyd Metro

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్ వారం రోజుల్లో అట్టహాసంగా ఆరంభంకానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో లీగ్‌లోని మిగతా జట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క మ్యాచ్(ఏప్రిల్ 22) మినహా మిగతా మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు జరుగుతాయి. మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన అభిమానులు అర్ధరాత్రి తరువాత ఇంటికి వెళ్లడానికి ఆసమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ స్టేడియం పక్క నుంచే హైదరాబాద్ మెట్రో రైల్ కారిడార్ వెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రో రైళ్లను అర్ధరాత్రి 10 గంటల వరకే నడుపుతున్నారు. మ్యాచ్‌లున్న రోజుల్లో వీటిని అర్ధరాత్రి 12:30 గంటల వరకు నడుపుతామని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది.