ఏపి హోంగార్డులు మాకొద్దు: రజత్‌ కుమార్‌

RAJATH KUMAR
RAJATH KUMAR

హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితంచేసే అవకాశమున్నందున బందోబస్తు ఏర్పాట్లకు ఏపీ హోంగార్డులను తీసుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ చెప్పారు. ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల తెలంగాణలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సర్వేల కోసం వచ్చి తెలంగాణ పోలీసులకు పట్టుబడిన . సోమవారం తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రజత్‌కుమార్.. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందన్నారు. కాగాసాధారణ పోలీసు విధులు కొనసాగుతాయని, ఎన్నికల అంశాలు మాత్రమే తమ పరిధిలోకి వస్తాయని వివరించారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణకు 25 వేలమంది హోంగార్డులు కావాలని చెప్పారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ఐదు వేలమంది చొప్పున బలగాలను కోరామని  అన్నారు.