ఎర్ర‌జొన్న అన్న‌దాత‌ల‌కు ఎంపీ క‌విత భ‌రోసా

Kavitha K
Kavitha

హైదరాబాద్ : ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందవద్దని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ప్రతీ బస్తాను మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందని ఎంపీ కవిత తెలిపారు. కొద్దిరోజులుగా ఎర్రజొన్న రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావు తో ఎంపీ కవిత మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని ఆమె స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఎర్రజొన్న రైతుల బకాయిలను చెల్లించిన విషయాన్ని ఎంపీ కవిత గుర్తు చేశారు. పంటలకు అవసరమైన నాణ్యమైన కరెంటు తోపాటు మార్కెటింగ్ సౌకర్యాలు పెంచామని, సాగునీటి వనరులను సైతం పెంచిన విషయం రైతులకు తెలుసునన్నారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలను నమ్మవద్దని ఆమె రైతులను కోరారు. ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కవిత తెలిపారు. నిన్న హైదరాబాద్ లో మంత్రులు హరీష్ రావు పోచారం శ్రీనివాసరెడ్డి మార్కెటింగ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎర్రజొన్న రైతుల ఆందోళనపై చర్చించిన విషయం తెలిసిందే.