ఎన్ని అడ్డంకులు వచ్చినా సచివాలయం కడతాం: కర్నె

K Prabhakar
K Prabhakar

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు నూతన సచివాలయాన్ని నిర్మించవద్దని అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా నిర్మించి తీరుతామని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ కార్యానికి ఎందుకు అడ్డుపడుతున్నాయో అర్ధం కావడం లేదని అన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో కనీస వసతులు కూడా లేవన్నారు. బైసన్‌ పోలో మైదానం అందరికీ దగ్గరలో ఉంటుందని పైగా మెట్రో సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు.