ఉ.వర్సీటీ పిజి కోర్సుల పరీక్ష తేదీలు ఖరారు

O U Arts College
O U Arts College

హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ పరిధిలో పలు పిజి కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పిజి కోర్సుల ప్రథమ, తృతీయ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలనున వచ్చే నెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు సంబంధిత వర్సిటీ వెబ్‌సైట్‌ను లాగిన్‌ అవ్వాల్సిందిగా అదికారులు సూచించారు.