ఉప రాష్ట్ర‌ప‌తి రాక‌ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

 

Venkaiahnaidu
Venkaiahnaidu

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా శనివారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆయన పర్యటించే నిర్ణీత సమయంలో ఆయా రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత ఉంటుందని వెల్లడించారు. శనివారం మద్యాహ్నం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు బంజారాహిల్స్‌లోని ఉపరాష్ట్రపతి నివాసం నుంచి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియో ఆసుపత్రి వరకు. బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, సంగీత్ ఎక్స్‌రోడ్స్, తర్నాక, హబ్సిగూడ జంక్షన్, స్ట్రీట్ నెం..5, ఎన్‌జీఆర్/స్ట్రీట్ 8, హబ్సిగూడ, జెన్‌ప్యాక్ట్ రూట్లలో ఈ ఆంక్షలు కొనసాగుతాయి. తిరుగు ప్రయాణంలో 4.45 నిమిషాల నుంచి 5.15 మధ్య జెన్‌ప్యాక్ట్, స్ట్రీట్ నెం.8 నుంచి బంజారాహిల్స్ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.