ఉప్ప‌ల్‌లో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ స‌ద‌స్సు

Bnthu Rammohan
Bnthu Rammohan

హైదరాబాద్‌ : స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ‘మనం మారుదాం.. మన నగరాన్ని మారుద్దాం’ నినాదంతో బహిరంగ సభను నిర్వహించారు. సుమారు 30 వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేయటం ద్వారా కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌ రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌పై ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. రచ్చరవి తదితర కళాకారులతో కలిసి మంత్రి నాయిని ఆడిపాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో భారీ కేక్‌ను కట్‌ చేసి నేతలు సంబురాలు చేసుకున్నారు.