ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మరోసారి పాపిరెడ్డి నియామకం

tsche chairman papi reddy
tsche chairman papi reddy

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రభుత్వం తిరిగి పాపిరెడ్డినే నియమించింది.
ఆయన ఈ పదవిలో మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్‌
లింబాద్రిని, మరో ఉపాధ్యక్షులుగా హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ వెంకట రమణను నియమించింది. ఈ మేరకు
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.