ఉద్యోగినీల‌కు ఊర‌ట‌

Telangana
Telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగినీల‌కు శుభవార్త. వీరికి మరో ఐదు సాధారణ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సాధారణ, ఐచ్చిక సెలవులకు మరో ఐదు సెలవులకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఫైలుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. గర్భిణీగా ఉన్న ఉద్యోగి సాధారణ పరిస్థితులు ఉంటే 8వ నెల నుంచి ఎప్పుడైనా 180 రోజులు సెలవులు తీసుకోవచ్చు. మొదటి, రెండవ కాన్పులకు మాత్రమే ప్రసూతి సెలవులకు అనుమతి ఇస్తారు. కాన్పుకు ఉద్యోగినికి ఉండే సహజ సెలవులను ఉపయోగించుకోవచ్చు. పర్మింనెంట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. దీనిని డ్యూటీగానే పరిగణించి సర్వీస్‌ను కొనసాగిస్తారు.