ఉద్యోగాలను భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్‌

kodandaram
kodandaram

ఖమ్మం:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం డిమాండ్‌ చేశారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగాలపై చేసిన ప్రకటన సరిగాలేదన్నారు. రాష్ట్రంలో సుమారు 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాధనలో ముందుడి పోరాడామనీ, ఇప్పుడు 1200 మంది అమరుల ఆశయానికి పోరాటం చేస్తున్నామన్నారు.