ఉత్త‌మ్ ను మాద‌న్న‌పేట పిఎస్‌కు త‌ర‌లించిన పోలీసులు

TPCC CHIEF UTTAM KUMAR REDDY
TPCC CHIEF UTTAM KUMAR REDDY

హైద‌రాబాద్ః టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని గాంధీభవన్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలసి ర్యాలీగా బయల్దేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నగరంలోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.