ఈ నెలాఖ‌రున అసెంబ్లీ స‌మావేశాలు

Assembly meetings
Assembly meetings

హైద‌రాబాద్ః అక్టోబ‌రు నెల 27 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నెలరోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. 26న బీఏసీ సమావేశం జరగనుంది.15 నుంచి 20 రోజుల పనిదినాలు ఉండేలా షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్, హైకోర్టు విభజన, ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం తదితర అంశాలపై చర్చలు జరగనున్నట్లు స‌మాచారం.