ఈ తీర్పుతో మ‌రిన్ని ర‌చ‌న‌లు చేసే ఆవ‌కాశంః కంచె ఐల‌య్య‌

Prof. Kanche Ilaiah
Kanche Ilaiah

హైద‌రాబాద్ః ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయంపై కంచె ఐలయ్య మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఈ తీర్పు ద్వారా మరిన్ని రచనలు చేసే అవకాశం కోర్టు తనకు కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు. కులాల చరిత్ర, సంస్కృతిపై మరింత స్వేచ్ఛగా, రాజ్యాంగ బద్ధంగా పరిశోధనలు చేసే అవకాశం తనకు లభించిందని అన్నారు.