ఈరోజు నుండి దసరాకోసం స్పెషల్‌ బస్సులు

tsrtc busses copy
tsrtc busses

 హైదరాబాద్ :టిఎస్‌ఆర్టీసీ  దసరా పండుగ  స్పెషల్ బస్సులను నడుపుతున్నది. ఈరోజు   వరకు 1981 బస్సులను నడుపుతుండగా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 16వ తేదీ నుంచి 18 వరకు 2,499 బస్సులు, 16న 1110 బస్సులను ,17న 1085 బస్సులు, 18న 304 అదనపు బస్సులను నడిపిస్తున్నారు.  అంతేకాక    మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. తమ గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటుండడంతో ఎంజీబీఎస్ ప్రాంగణం కిటకిటలాడుతున్నది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు గాను టీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే అదనపు బస్సులను ఏర్పాటు చేయగా, 16 నుంచి 18 వరకు తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ర్టాలకు ప్రయాణికుల సౌకర్యార్ధం 4480 అదనపు బస్సులను నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది.